సిక్స్ ప్యాక్‌లో తమిళ కమెడియన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్‌గా క్రేజ్ తెచ్చుకున్న సునీల్ హీరోగా టర్న్ ఇచ్చి మంచి విజయాలు అందుకున్నాడు.. అయితే హీరో అనిపించుకోవాలంటే బాడీ సైజ్ మార్చాల్సిందే అని పట్టుబట్టి మరి సిక్స్‌ప్యాక్ చేసి అదరగొట్టాడు. ఆమధ్య సునీల్ సిక్స్‌ప్యాక్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు అదేదారిలో ఫాలో అవుతున్నాడు ప్రముఖ తమిళ కమెడియన్ సూరి. తమిళంలో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి మంచి క్రేజ్‌తెచ్చుకున్న సూరి తాజాగా శివకార్తికేయన్, సమంత జంటగా నటించిన సీమరాజు సినిమాలో నటించాడు. ఈ సినిమాలో మనోడు సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తాడట. ఇప్పటికే సూరి సిక్స్‌ప్యాక్ ఫొటోలు కోలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి. అయితే ఇతగాడు హీరో అవ్వడానికి సిక్స్‌ప్యాక్ చేశాడా.. లేక ఈ సినిమా కోసమేనా అన్నది తెలియాల్సి ఉంది. సూరి అటు తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈమధ్య హీరో కార్తీతో కలిసి నటించిన చినబాబులో మంచి కమెడియన్‌గా అదరగొట్టాడు. మరి సూరి సిక్స్‌ప్యాక్‌పై ఓ లుక్ వేయండి.