క్రేజీ క్రేజీ ఫీలింగ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. సంజయ్ కార్తీక్ దర్శకుడు. విష్వంత్, పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ.. కేరింత, మనసంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వంత్ హీరోగా, పల్లక్ లల్వాని హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్‌ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం. వెనె్నల కిశోర్ పాత్ర ఆకట్టుకుంటుంది. నిర్మాత మధు మాట్లాడుతూ.. ప్రేమ, ఫీల్, వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా క్రేజీ క్రేజీ ఫీలింగ్‌ని రూపొందిస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్, రామానాయుడు స్టూడియోల్లో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విడుదలయ్యేంతవరకే చిన్న సినిమా, విజయం సాధించి పెద్ద సినిమా అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విష్వంత్, పల్లక్ లల్వాని, వెనె్నల కిశోర్, ఫిదా ఫేమ్ శరణ్య, సుమన్, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, సిసిరోలియో, సాహిత్యం: సురేష్ ఉపాధ్యాయ, కాసర్ల శ్యామ్, కెమెరా: సుభాష్ దొంతి, ఆర్ట్: నాగు, కొరియోగ్రఫీ: రాజకిరణ్, చార్లీ.