అక్కినేని జయంతి మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, మహానటులు డా.అక్కినేని నాగేశ్వరరావు95వ జయంతి మహోత్సవాన్ని రసమయి విలక్షణంగా నిర్వహిస్తోంది. ‘అక్కినేని ఆలోచనలు’ సంస్కృత అనువాద గ్రంథం ‘అక్కినేని అనుచింతనాని’ ఆవిష్కరణ. అక్కినేనిపై ‘రసమయి’ ప్రేరణతో భారత ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్‌మెంట్ (తెలంగాణ రాష్ట్రం) రూపొందించిన అక్కినేని ప్రత్యేక తపాలా చంద్రిక (అక్కినేని స్పెషల్ పోస్టల్ కవర్) ఆవిష్కరణ జరగనున్నాయి. అక్కినేని ఎంతో అనుభవ పూర్వకంగా రచించిన వారి అపూర్వ అనుభూతుల గ్రంథం ‘అక్కినేని ఆలోచనలు’ ఈ గ్రంథాన్ని గత సంవత్సరం ఆంగ్ల అనువాదాన్ని, హిందీ అనువాదాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సంవత్సరం ఆ గ్రంథ సంస్కృత అనువాదాన్ని కందించబోతున్నారు. అలాగే ‘రసమయి’ ప్రేరణతో అక్కినేనివారి పేరున భారత ప్రభుత్వ పోస్టల్ డిపార్టుమెంట్ వారు ‘అక్కినేని స్పెషల్ పోస్టల్ కవర్’ (అక్కినేని ప్రత్యేక తపాలా చంద్రిక) పేరున విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు పూర్వ గవర్నర్ డా.కె.రోశయ్య, సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి పూర్వ చైర్మన్ డా.ఎ.చక్రపాణి, చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్, డా.బి.వాణీదేవి, ‘పద్మశ్రీ’ డా.ఎ.ఎస్.నారాయణ, శ్రీ రావి కొండలరావు, డా. కె.వి.కృష్ణకుమారి, శ్రీ జి.వి.ఎన్.రాజు అతిథులుగా పాల్గొంటారు. ఈనెల 19న సాయంత్రం 6 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభలో డా.అక్కినేని 95వ జయంతి మహోత్సవంలో పై రెండు కార్యక్రమాలు ఉంటాయని ‘మహానటులు అక్కినేని’ శీర్షికన డా.ఎం.కె.రాము రచించిన సంగీత రూపక ప్రదర్శన వుంటుందని రసమయి అధ్యక్షులు డా.ఎం.కె.రాము తెలిపారు.