సిద్ధమవుతున్న మయసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీను, శ్రీవల్లి జంటగా ఖమ్మం క్రియేషన్స్ పతాకంపై నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవా, కోటయ్య, రమణారెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మయసభ’. ఈ చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా చిత్రం శ్రీను మాట్లాడుతూ, సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమాను పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఇప్పటివరకు ఖమ్మం, కృష్ణాజిల్లా మైలవరం, హైదరాబాద్‌లో పది పది రోజుల చొప్పున 50 శాతం షూటింగ్ పూర్తిచేశామని, నాలుగు పాటలతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. అందరినీ నవ్వించే విధంగా పూర్తి కుటుంబ కథా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నామని, కామెడీని సరికొత్త ట్రాక్‌లో పండించే ప్రయత్నం చేస్తున్నామని, అతిత్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. చింటూ, జూ.రేలంగి, షకలక శంకర్, రాఘవ, వెంకట్, కోటయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సాకేత్, పాటలు: శ్రీమాన్, కాసర్ల శ్యామ్, కెమెరా: గోపి కాకర్ల, కథ, దర్శకత్వం:నెప్పలి కృష్ణ.