బాలీవుడ్ కంపెనీతో దేవదాస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున, నాని హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. నాగార్జున డాన్‌గా దేవ్ అనే పాత్రలో నటిస్తుండగా.. నాని దాస్‌గా డాక్టర్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ కంపెనీ వయాకామ్ 18 సొంతం చేసుకుంది. తెలుగు సినిమాలను మార్కెట్ చేసే విషయంలో ఇప్పటికే పలు బాలీవుడ్ కంపెనీలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలయన్స్, టి సిరీస్, యాష్ రాజ్ ఫిలిమ్స్, ధర్మ ప్రొడక్షన్ లాంటి పాపులర్ బ్యానర్స్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా మరో పాపులర్ కంపెనీ వయాకామ్ 18 టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ కంపెనీ ఈ సినిమా తెలుగు హక్కులను భారీ ఆఫర్‌తో దక్కించుకోవడం విశేషం.