శైలజారెడ్డి ఓ స్వీట్ సర్‌ప్రైజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమ్యకృష్ణ ‘శైలజారెడ్డి’గా మరో అవతారం ఎత్తారు. నాగ చైతన్య, అనుఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
నేడు రమ్యకృష్ణ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్...
* రమ్యకృష్ణగారు ముందుగా మీకు బర్త్‌డే విషెస్.. పుట్టినరోజు కానుకగా ‘శైలజారెడ్డి అల్లుడు’ మంచి విజయాన్ని సాధించడం ఎలా ఉంది?
- ధన్యవాదాలు. ఈ పుట్టినరోజుకు ఒక మంచి చిత్రం సూపర్‌హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ చిత్రంలో అందరూ కష్టపడ్డారు. వారందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు.
* ఈ చిత్రం చూసిన వారంతా మీ పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.. ఈ రెస్పాన్స్ మీద మీ కామెంట్.
- డెఫినెట్‌గా శైలజారెడ్డి పాత్ర వైవిధ్యంగా వుంటుంది. ఒకప్రక్క ఊరిలో ఆడవాళ్లకి అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడే ధీరత్వం.. మరోవైపు తల్లిగా కూతురు మీద ప్రేమ.. సమస్య వస్తే ఎదుర్కొనే ధైర్యం వున్నాయి. మారుతి ఈ పాత్రని మలచిన విధానం చాలా బాగుంది. ఈ చిత్రంలో అత్త పాత్ర రెగ్యులర్‌గా ఉండదు. మీరు ఎప్పుడూ చూస్తున్న అత్తా అల్లుళ్లమధ్య కామెడీ కూడా ఈ చిత్రంలో కనిపించదు. స్వీట్ సర్‌ప్రైజ్‌లా వుంటుంది.
* ఈ చిత్రంలో మీది ఇగో కేరెక్టర్ కదా?
- అదీ ఓ పక్క ఉంటుంది.. కానీ సీన్స్ అన్నీ కొత్తగా వుంటాయి. కొత్త అత్త, అల్లుడ్ని చూస్తారు ఈ చిత్రంలో.
* అత్తకి ఇగో, కూతురికి ఇగో.. పాపం అల్లుడుమీద జాలి వేయలేదా?
- నిజం అండీ.. అత్తగా నాకు ఇగో, కూతురికి ఇగో.. ఇక్కడవరకూ నేను ఎంజాయ్ చేశాను సేమ్ నాలాంటి పాత్ర ఇంకొకటి నాకు తోడుగా ఉంది అని. పాపం చైతన్యకి మాత్రం ఫుల్ టెన్షన్‌గా ఉంది. మా ముగ్గురి మధ్యలో నరేష్, మాణిక్యంగా పృథ్వీ, వెనె్నల కిషోర్ కేరెక్టర్స్ కామెడీగా వుంటాయి. నేను బాగా ఎంజాయ్ చేశాను.
* నాగార్జునతో చేశారు, ఇపుడు నాగచైతన్యకి అత్తగా చేశారు.. చైతు నటన ఎలా ఉంది?
- నాగచైతన్య వెరీ డౌన్ టు ఎర్త్ వుండే మనిషి. యాక్టింగ్‌లో చైతు చాలా గ్రోత్ అయ్యాడు. ముఖ్యంగా నన్ను, అనుని కన్విన్సింగ్ చేసే సీన్‌లో చాలా ఈజ్‌తో, మెచూర్డ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు.
* మారుతి వర్కింగ్ స్టైల్ ఎలా వుంది? ఏమైనా టీచ్ చేశారా?
- టీచ్ చేయడమా.. అంత టైమ్ ఇవ్వరు ఈ డైరెక్టర్. స్పీడ్‌గా వర్క్ చేస్తారు.. మిషన్‌లా. జస్ట్ రెడీ అయ్యి కూర్చుందామనుకునేసరికి షాట్ రెడీ అని కాల్ చేస్తారు. ఒక రోజు వర్షం పడుతుంది కదా వదిలేస్తాడేమో అనుకున్నా.. ఆ గ్యాప్‌లో కూడా తీసేశారు. వెరీ గుడ్ ప్లానింగ్. నా కెరీర్‌లో ఇంత ఫాస్ట్‌గా షూటింగ్ చేసి ఇచ్చిన చిత్రం శైలజారెడ్డి మాత్రమే.
* సీరియస్ పాత్రలు ఎలా చేస్తారో కామెడీ కూడా అంతే ఈజీగా ఎలా చేయగలుగుతారు?
- అలా ఏమీ కాదు, ఆర్టిస్టు అంటే అన్నీ చేయాలి. కో ఆర్టిస్ట్ పర్‌ఫెక్ట్‌గా వుంటే కామెడీ చాలా బాగా వస్తుంది, అదికూడా స్పాంటేనియస్‌గా వస్తుంది. నేను కామెడీ బాగా చేసిన చిత్రం పంచతంత్రం. శైలజారెడ్డి చిత్రంలో నా చుట్టూ కామెడీ జరుగుతుంటుంది. హిలేరియస్‌గా వుంటుంది కాని నేను సీరియస్‌గా వుండాలి. ఇది నాకు డిఫికల్ట్‌గా అనిపించింది.
* సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి గురించి?
- సినిమాలో అందరూ చాలా అందంగా వున్నారు. మారుతి స్పీడ్‌కి ఆయన పరుగెత్తి షూట్ చేసేవాడు పాపం..
* బాహుబలి తరువాత కొంచెం గ్యాప్ తీసకుని ఇలా అత్తగా కనిపించారు.. మరి ఇలాంటి రోల్స్ వస్తే చేస్తారా?
- నేను చేసిన వెరైటీ రోల్స్ మాత్రమే నన్ను ఆర్టిస్టుగా నిలబెట్టాయి. సో.. ఇలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా.
* నిర్మాతల గురించి?
- చాలా పాషినేటెడ్ ప్రొడ్యూసర్స్. దర్శకుడ్ని, నటీనటుల్ని నమ్మి ఇలా చిత్రాలు చేసే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. వారికి నా తరఫున కంగ్రాట్స్!
* చివరిగా ఈ చిత్రం గురించి?
- చాలా మంచి చిత్రం. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరూ ఆదరిస్తున్నారు. అలాగే శైలజారెడ్డి అల్లుడ్ని మరింత ఆదరించాలని కోరుకుంటున్నాను.