టీజర్‌లో హాయ్ హాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేయస్ ప్రొడక్షన్స్ పతాకంపై డా.యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో అరుణ్ తేజ్, చరిష్మా శ్రీకర్ జంటగా బియన్‌రెడ్డి అభినయ దర్శకత్వంలో డా.యలమంచిలి ప్రవీణ్, డా.ఏయస్ కీర్తి, డా.జి.పార్థసారధిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘నీతోనే హాయ్ హాయ్’. ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో హీరో శ్రీకాంత్ చేతులమీదుగా జరిగింది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘’టైటిల్ చాలా హాయిహాయిగా ఉంది. వైద్య వృత్తిలో ఉంటూ సినిమా రంగం మీద ఇష్టంతో వచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలకు అభినందనలు. సినిమా ఫీల్డ్‌లో కష్టాలు, నష్టాలు ఉంటాయి. కానీ సిన్సియర్‌గా కష్టపడితే మాత్రం కచ్చితంగా ఫలితం దక్కుతుంది. దర్శకుడు బియన్‌రెడ్డిగారు దాసరిగారి లాంటి దర్శకులవద్ద పనిచేసిన అనుభవంతో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని టీజర్ చూస్తే తెలుస్తుంది. కొత్తవారైనా హీరోహీరోయిన్స్ చక్కటి నటన కనబరిచారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. కంటెంట్ బావుంటే కొత్త, పాత లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు అన్నారు. దర్శకుడు బియన్‌రెడ్డి అభినయ మాట్లాడుతూ.. ‘‘మార్చి 7న శ్రీకాంత్ గారి చేతులమీదుగా మా సినిమా ప్రారంభమై విజయవంతంగా పూర్తయింది. వారిది లక్కీహ్యాండ్. ఆ సెంటిమెంట్‌తో శ్రీకాంత్‌గారి చేతులమీదుగా టీజర్ లాంచ్ చేశాం. నిర్మాతలు నన్ను, నా కథని నమ్మి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. పాటల షూటింగ్‌కోసం వెళ్లినప్పుడు చిక్‌మంగుళూరులో కొన్ని సమస్యలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి షూటింగ్ కంప్లీట్ చేశాం. సినిమా చాలాబాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు. హీరోయిన్ మాట్లాడుతూ.. ఇంత మంచి సినిమాలో నేనూ పార్ట్‌అవడం హ్యాపీగా ఉందన్నారు. హీరో అరుణ్‌తేజ్ మాట్లాడుతూ.. ‘ఎంతో హాయిగా షూటింగ్ జరిగింది. ఎంతో ఫాస్ట్‌గా అనుకున్న దానికన్నా ముందే సినిమా చేశారు దర్శకుడు. అన్నివర్గాల వారికి నచ్చే విధంగా సినిమా ఉంటుందన్నారు. నిర్మాత డా.పార్థసారధిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నో వ్యయ ప్రయాసలుకోర్చి సినిమాచేశాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. డా.ఏయస్ కీర్తి మాట్లాడుతూ.. ‘సినీ రంగంలో ఎంతో అనుభవంవున్న బియన్‌రెడ్డిగారు అన్నీతానై ఈ సినిమాచేశారు. ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టమో ఒక సినిమా తీయాలన్నా దాదాపు అంతే కష్టమని, ఈ సినిమా చేశాక అర్థమైంది. సినిమా అనుకున్న విధంగా తీసాం’ అన్నారు. సమర్పకులు డా.యలమంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘ఎంతో పాషన్‌తో ఈ సినిమా చేశాం. అంతే పాషన్‌తో ఉన్న దర్శకుడు ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేశారు’ అన్నారు.