ప్రత్యేక పాటలో పాయల్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 September 2018
ఆర్ఎక్స్ 100 సినిమా సక్సెస్‌తో ఓవర్‌నైట్‌లో సెనే్సషనల్ హీరోయిన్గా మారిపోయింది పాయల్ రాజ్‌పుత్. తన బోల్డ్నెస్ గ్లామర్‌తో కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపును తన వైపునకు తిప్పుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ హీరోయిన్ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్-తేజ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. కాగా పాయల్ ఈ సినిమాలో ప్రత్యేక సాంగ్‌లో చేయనుందని, అందుకు ఆమె ఇప్పటికే అంగీకరించిందని సమాచారం. మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకున్న హీరోయిన్ ఇలా ప్రత్యేక గీతాల్లో నర్తించేందుకు అంగీకరించిందంటే సాహసమే అని చెప్పాలి. ఈ సాహసం ఆమె కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ కానుందో చూడాలి.