భారీ హంగులతో సామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్యమి ఫిలిం మేకర్స్, ఎం.జి ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెనే్సషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం సామి. సింగం, సింగం 2, సింగం 3, పూజా వంటి సూపర్‌హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విక్రమ్-హరి కాంబినేషన్‌లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన సామి చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడదే టైటిల్‌తో తెలుగులో రాబోతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్‌తోనే హరి దుమ్ము దులిపేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్ నట విశ్వరూపం ఇందులో చూస్తారు. హరి గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము అని అన్నారు.