మెగా స్క్రిప్ట్ సిద్ధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్‌తో సినిమా చేయాలని ఏ దర్శకుడు అనుకోడు చెప్పండి. అయితే ఇలాంటి అవకాశం కొందరు దర్శకులకు చెప్పకుండా వచ్చేస్తాయి. ఇపుడు అలాంటి క్రేజీ అవకాశాన్ని కొట్టేశాడు దర్శకుడు కొరటాల శివ. మిర్చి, సినిమాతో క్రేజీ దర్శకుడిగా మారిన కొరటాల శివ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, లేటెస్టుగా భరత్ అనే నేను సినిమాలతో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా సెటిల్ అయ్యాడు. ఆయన తన తదుపరి చిత్రం మెగాస్టార్‌తో చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ కోసం స్క్రిప్ట్ విషయంలో బిజిగా మారిన కొరటాల చిరంజీవి కోసం ఓ సూపర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట. ప్రస్తుతం మెగాస్టార్ సైరా చిత్రంలో బిజీగా ఉన్నాడు. మరో నెలరోజులపాటు షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తోపాటు మంచి కమర్షియల్ హంగులతో వుంటుందని కొరటాల అంటున్నాడు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది.