‘పల్లెవాసి’ మోషన్ పోస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాథ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘పల్లెవాసి’. ప్రముఖ గీత రచయిత వెనె్నలకంటి తనయుడు రాకేందువౌళి హీరోగా నటిస్తున్నాడు. కల్కి హీరోయిన్. మేకా రామకృష్ణ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను వినాయక చవితి పర్వదినం సందర్భంగా విడుదల చేశారు. చిత్ర దర్శకుడు గోరంట్ల సాయినాథ్ మాట్లాడుతూ.. పల్లెటూరి నేపథ్యమున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌అయ్యే సినిమా ‘పల్లెవాసి’. ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నామన్నారు. నిర్మాత రాంప్రసాద్ మాట్లాడుతూ.. తొంభై శాతం చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలోనే పల్లెవాసిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. ఈ చిత్రానికి రచన, నిర్మాత: జి.రాంప్రసాద్, కెమెరామెన్: లక్ష్మణ్, కోడైరెక్టర్: శ్యాం, ఎడిటర్: జానకిరామ్, దర్శకత్వం: సాయినాథ్.