21న ‘అంతర్వేదమ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రవికిషోర్ మాట్లాడుతూ.. ‘చాలా కష్టపడి క్రౌడ్ ఫండింగ్‌తో రెండేళ్లపాటు రెస్ట్ తీసుకోకుండా తెరకెక్కించిన చిత్రమిది. ప్రేక్షకులు మా కష్టాన్ని అర్థంచేసుకొని సినిమాని ఆదరిస్తారని కోరుకొంటున్నాను! సోషియో ఫాంటసీగా ఈ సినిమాను ఉత్కంఠ భరితంగా తీశాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్ట్ఫికెట్ లభించింది. ఈ నెల 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామన్నారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ... ‘అంతర్వేదమ్’ చిత్రంలో నటించినవారు కానీ.. యూనిట్ మెంబర్స్ కానీ అందరూ కొత్తవారే, సినిమా పట్ల వాళ్ళ ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది. కథాకథనాల పరంగా అంతర్వేదమ్ ది బెస్ట్ మూవీగా దర్శకుడు తెరకెక్కించాడు. టీమ్ అందరికీ ఈ సినిమా మంచి పేరును తీసుకురావాని కోరుకుంటున్నట్లు చెప్పారు. అమర్, సంతోషి, షాలు చౌరస్య, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, కమెడియన్ సాయి, జబర్దస్త్ మహేష్, దొరబాబు, రవి, లడ్డు, యోగి తదితరులు నటించిన చిత్రానికి చందిన రవికిషోర్ రచన దర్శకత్వం వహించారు. శివ దేవరకొండ కెమెరామెన్‌గా జె.యస్.నిథిత్ సంగీతం దర్శకత్వం వహించారు. ఎడిటర్: కళ్యాణ్, సహ నిర్మాత: ఎస్.ఎన్.