సూర్య కొత్త లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ ఇటీవల పొల్లాచిలో ప్రారంభమైంది. ‘రంగం’ఫేమ్ కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రంలో మోహన్‌లాల్, ఆర్య ముఖ్యపాత్రధారులు. చిత్రంలో సూర్య కొత్త మేకోవర్‌తో ఉన్న ఫొటో ఒకటి నెట్లో వైరల్ అవుతుంది. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న చిత్రంలో సూర్యకు జోడీగా సయేషా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా తమిళ న్యూ ఇయర్ డే ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇక సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘ఎన్జికె’ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న చిత్రం డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.