తెలుగులోనూ టాపవ్వాలి: చిరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనరేషన్ గ్యాప్‌వున్నా యువన్ సంగీతమంటే నాకు చాలా ఇష్టం. 80వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన ఇళయరాజా కొడుకు కావడం మరీ ఇష్టం. సంగీత దర్శకుడిగా బిజీగా ఉండికూడా నిర్మాతగా అడుగులేయడం అభినందించదగ్గ విషయం. కథపై ఎంత నమ్మకం ఉంటే తప్ప నిర్మాతగా చేయడు. ప్యార్ ప్రేమ కాదల్ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మెగాస్టార్ చిరు విడుదల చేశారు. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా తమిళంలో నిర్మించిన ‘ప్యార్ ప్రేమ కాదల్’ హిట్టవడంతో తెలుగు ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమవుతుంది. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లో సుప్రసిద్ధ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో నిర్మాతలు యువన్ శంకర్‌రాజా, విజయ్ మోర్వనేనిలు చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఎలన్ దర్శకత్వంలో హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథ. ప్యార్ ప్రేమ కాదల్ తెలుగు నాట కనువిందు చెయ్యడానికి అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోందని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.