రాజేంద్రుడు ఒకింత బేవర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’లాంటి క్లాసిక్స్‌తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం బేవర్స్. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లు. కాసం సమర్పణలో ఎస్‌ఎస్‌కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాతలు పొన్నాల చందు, ఎం.ఎస్.మూర్తి, ఎమ్.అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి దర్శకుడు రమేష్ చెప్పాల. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావడంతో అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్త ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తున్నాడు బేవర్స్. ఈ సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మొదట్లో నేను చిత్రానికి బేవర్స్ టైటిలేంటి అనుకున్నా. ఇదే డౌటు ఆడియెన్స్‌కీ వస్తుంది. కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది చిత్రం చూస్తే అర్ధమవుతుంది. తల్లిదండ్రులను అర్ధంచేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు.. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులూ బేవర్సేనన్న కానె్సప్ట్‌తో సినిమాను డిజైన్ చేశారు. సామాజిక స్పృహ కలిగిన చిత్రానికి దర్శకుడు రమేష్ రాసుకున్న సంభాషణలు అద్భుతం. నా కెరీర్‌లో మరో సూపర్‌హిట్ సినిమా చేశానన్న తృప్తి కలుగుతోంది. మ్యూజిక్ బాగుంటుంది. సుద్దాల అశోక్ తన మనసు, ప్రాణం పెట్టి రాసిన.. తల్లి తల్లి నా చిట్టితల్లి నా ప్రాణాలే పోయాయమ్మా... నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా... అంటూ సాగే పాట భావోద్వేగాన్ని కలిగిస్తుంది. హీరో, హీరోయిన్ బాగా చేశారు. అక్టోబర్ 5న విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారన్నారు. దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ మీ శ్రేయోభిలాషి చిత్రానికి రచయితగా ఎంతగా తృప్తిచెందానో బేవర్స్ చిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తిచెందాను. రాజేంద్రప్రసాద్ ఇలాంటి పాత్ర ఇప్పటివరకు చేయకపోవడం నా అదృష్టం. ఆడియన్స్‌ను అలరించేందుకు అక్టోబర్ 5నే చిత్రాన్ని తెస్తున్నాం అని వెల్లడించారు.