టార్గెట్ యూత్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెవి రాజు దర్శకత్వంలో కన్నడంలో రాజధాని పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో భాగ్యనగరం పేరుతో సంతోష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సంతోష్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కన్నడ స్టార్ యశ్, షీనా జంటగా ప్రకాష్‌రాజ్, ముమైత్‌ఖాన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేస్తున్న సందర్భంగా సమర్పకుడు డి.ఎస్.రావు మాట్లాడుతూ- కన్నడంలో ఘనవిజయం సాధించిన రాజధాని చిత్రాన్ని భాగ్యనగరం పేరుతో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ఉజ్వల భవిష్యత్తు కలిగిన నలుగురు యువకులు అక్రమార్జన కోసం ఎలా చెడుదారి పట్టింది, మాదకద్రవ్యాలకు అలవాటుపడి ఎలా జీవితాన్ని కోల్పోయారు అన్న అంశాలతో చిత్రం ఉంటుంది. యూత్‌కు మంచి మెసేజ్ అందించే చిత్రంలో ప్రకాష్‌రాజ్ పాత్ర హైలెట్. చిత్రాన్ని మేము విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాత సంతోష్ మాట్లాడుతూ మొదట ఓ డబ్బింగ్ సినిమా చేసి తరువాత స్ట్రెయిట్ సినిమా చేయాలని నిర్మాతగా ఎంటర్ అయ్యాను. కన్నడంలో సంచలన విజయం సాధించిన చిత్రాన్ని భాగ్యనగరం పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాము. మంచి కమర్షియల్ అంశాలతోపాటు వినోదాత్మకంగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 5న భారీ స్థాయిలో విడుదల చేస్తామన్నారు. ఈ సినిమాను విడుదల చేస్తున్నందుకు నిర్మాత డి.ఎస్.రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.