అందుకే నిర్మాతగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం ఈరోజుల్లో అంత సులువుకాదు. ఆ పేరు కేవలం మొదటి సినిమాకే తోడ్పడుతుంది కానీ నిలబెట్టడానికి కాదు. మనం ఎదగాలంటే అహర్నిశలూ శ్రమించడమే అంటున్నాడు హీరో సుధీర్‌బాబు. ఎస్‌ఎంఎస్ సినిమాతో హీరోగా పరిచయమైన సుధీర్‌బాబు ఎనిమిదేళ్లలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సుధీర్ చేస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఆర్.ఎస్.నాయుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధీర్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం
శుక్రవారం విడుదలవుతుంది. సుధీర్‌బాబుతో ఇంటర్వ్యూ...

నిర్మాతగా మారడానికి కారణం?

- నేను హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటినుంచీ హీరో అయ్యాక కూడా చాలామంది కొత్తవాళ్లు పరిశ్రమకు వస్తుండడం, అందులో అవకాశాలు దొరక్క టాలెంట్ వున్నా కూడా తిరిగి వెళ్లిపోవడం జరుగుతోంది. అలాంటి సంఘటనలు చాలా చూశా. నేను హీరోగా సెటిల్ అయిన తరువాత నిర్మాతగా ఇలాంటి టాలెంట్‌ను ప్రోత్సహించాలని అనుకున్నాను. అందుకే నిర్మాతగా మారా.

మీ ఫ్యామిలీలో నిర్మాణ సంస్థలు ఉన్నాయి కదా? సొంతంగా ఎందుకు?

- నటుడు అనేవాడు ఎప్పటికైనా ఫేడౌట్ అవుతాడు. కానీ బ్యానర్ మాత్రం కాదు. మనం ఇప్పటికీ సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్‌లాంటి బ్యానర్ల గురించి చెప్పుకుంటున్నాం. అది మనతోనే ఆగిపోదు. మన తరువాత జనరేషన్స్‌లో సాగిపోతుంటుంది. నేను మొదటినుంచీ ఇండిపెండెంట్‌గా ఎదగాలి అని అనుకుంటాను. నేనెప్పుడూ కష్టాల్లో వున్నపుడు కూడా కృష్ణగారి దగ్గరికి లేదా మహేష్ దగ్గరికి వెళ్లి నన్ను రికమెండ్ చేయమని అడగలేదు. ఎలాంటి సహాయం తీసుకోలేదు. అందుకే నాకంటూ స్వంతంగా ఈ బ్యానర్ ఉండాలని పెట్టాను.

ఈ సినిమా కోసమే నిర్మాతయ్యారా?

- కాదు. సమ్మోహనం సినిమా రిలీజ్‌కంటే ముందే ఈ సినిమా మొదలైంది. అయితే ప్రీ ప్రొడక్షన్ తరువాత కొంత గ్యాప్ వచ్చింది. ఆ తరువాత నిర్మాత తప్పుకోవడంతో నేను ఎంటర్ అయ్యాను. ఈ సినిమాకు హీరోగానే సంతకం పెట్టా.

నిర్మాతగా ఎలాంటి అనుభవాలు ఉన్నాయి?

- ఇప్పటివరకూ హీరోగా చెక్కులు తీసుకున్నా. ఇపుడు నిర్మాతగా ఇస్తున్నా. ఏదైనా సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తా. ఈ బ్యానర్‌లో మంచి సినిమాలు రావాలి. పనిచేసినవారందరికీ మంచి పేరు రావాలనేది నా కోరిక. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుంటా. నిర్మాతగా ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాను.

కథ గురించి చెప్పండి?

-ఈ సినిమాలో మంచి ప్రేమకథ ఉంటుంది. ప్రతి పాత్ర నిజీ జీవితాలకు దగ్గరగా ఉంటూ ప్రేక్షకులు స్వంతం చేసుకుంటారు. నా పాత్రకి కొంచెం ఎమోషన్స్ తక్కువ. ఏదైనా బిజినెస్ టార్గెట్‌గా ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఓ అమ్మాయి ఎంటర్ అయితే ఏం జరిగిందన్నదే కథ.

హీరోయిన్ గురించి?

-ఈ కథ ప్రకారం కొత్త అమ్మాయిని ఎంపిక చేశాం. కథను నడిపించేది అమ్మాయి పాత్ర కాబట్టి చాలా నేచురల్‌గా ఉండాలి. అందుకే నభా నటేష్‌ను ఎంపిక చేశాం. తను వంద శాతం ఎఫర్ట్ పెట్టి నటించింది. ఆమె ఆ స్థాయిలో చేసింది కాబట్టే సినిమా మరో రేంజ్‌కి వెళ్లింది. తప్పకుండా తను టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారుతుంది.

కొత్త దర్శకుడితో రిస్క్ కాదా?

-నిజానికి కథ విన్నాక నచ్చింది కాబట్టే సినిమా చేస్తున్నాను. అనుకోకుండా నిర్మాత తప్పుకోవడంతో నేను ఎంటర్ అయ్యాను. సినిమాపై నమ్మకం ఉంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు. దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే మిగతా టెక్నీషియన్ల పనితనం సినిమాకు హైలెట్ అంశాలుగా నిలుస్తాయి. ముఖ్యంగా కన్నడంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వున్న అజనీష్ అందించిన పాటలు మంచి హిట్స్‌గా నిలిచాయి.

బయట హీరోలతో సినిమాలు?

-తప్పకుండా. మంచి కథలు, దర్శకులు దొరికితే ఇతర హీరోలతో కూడా సినిమాలు చేస్తాను. ఒకవేళ మంచి కథ కుదిరితే మహేష్‌తో కూడా సినిమా తీస్తా.

నిర్మాతగా మారినందుకు మహేష్ రెస్పాన్స్?

-ఈ విషయంలో మహేష్ కొంచెం టెన్షన్ పడ్డాడు. నేను సినిమాల్లోకి హీరోగా వస్తానన్నప్పుడే ఆయన కంగారు పడ్డాడు. ఏ రంగంలో అయినా విజయాలు పరాజయాలు ఉంటాయి. కానీ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్‌లు అందరికీ తెలిసిపోతుంది. దానివల్ల ఎఫెక్టు మాపై పడుతుంది. దాన్ని ఎలా తీసుకుంటానోనని టెన్షన్ పడేవాడు. కానీ ఇపుడు నిర్మాతగా మారుతున్నందుకు తను హ్యాపీ.

తదుపరి చిత్రాలు?

-ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో నటిస్తున్నా. హిందీ తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. దాంతోపాటు మరో సినిమా ఉంది. ఇకపై మల్టీస్టారర్‌లో కాకుండా సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది.

-శ్రీనివాస్ ఆర్.రావ్