టాలీవుడ్‌పై ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా అభిషేక్‌బచ్చన్ హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ, తన తండ్రిలాగా పెద్దగా స్టార్‌డమ్ తెచ్చుకోలేకపోయాడు. అటు హీరోగా కూడా సరైన సక్సెస్‌లు లేక సినిమాకి సినిమాకి గ్యాప్ తీసుకుంటున్నాడు. దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ తరువాత బాలీవుడ్ నటుడు అభిషేక్‌బచ్చన్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మన్మార్టియాన్’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. కాగా ఈ సినిమాలో నటించిన అభిషేక్‌కు మంచి పేరువచ్చింది. చాలా సహజంగా నటించాడని విమర్శకుల నుండి సైతం ప్రత్యేకమైన ప్రశంసలు లభించాయి. తాజాగా అభిషేక్ నిన్న హైదరాబాద్‌కి వచ్చాడు. మీడియాతో మాట్లాడారు. మీడియా.. తెలుగు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందా అని ప్రశ్నించగా.. నాకుకూడా తెలుగు సినిమాల్లో నటించాలని చాలా ఆసక్తిగా ఉందని అభిషేక్ తెలిపారు.