బాబు.. బాగా బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం కోలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యోగి బాబు. కమెడియన్‌గా, విలన్‌గా పలు చిత్రాల్లో నటించిన యోగిబాబు, తాజాగా నయనతారతో కలిసి నటించిన కొలమావు కోకిల సినిమాతో ఎవరూ ఊహించని రేంజ్‌కి చేరుకున్నాడు. ఈ సినిమాలో నయనతారను ప్రేమించే ప్రేమికుడిగా యోగిబాబు నటనకు అభినందన నీరాజనాలు పలుకుతున్నారు జనాలు. కమెడియన్‌గా అనూహ్యమైన రీతిలో క్రేజ్ తెచ్చుకుంటున్న యోగిబాబుకు ఈ సినిమాతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే ఆయన పది సినిమాల్లో కమెడియన్‌గా ఎంపికయ్యాడట. 2020 వరకూ ఆయన డైరీ ఖాళీగా లేదట. మొత్తానికి కొలమావు కోకిలతో స్టార్ కమెడియన్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటివరకూ తమిళ్‌లో సెంథిల్, వడివేలు, వివేక్, సంతానం తరహాలో యోగిబాబు కూడా బిజీ బాబుగా మారాడు.