ఈ దేవదాసూ తక్కువేం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్ నాగార్జున, నాని కాంబినేషన్‌లో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, వైజయంతీ మూవీస్ బ్యానర్స్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన భారీ మల్టీస్టారర్ ‘దేవదాస్’. అక్కినేని జయంతి సందర్భంగా సినిమాలోని పాటలను హైదరాబాద్‌లో విడుదల చేసారు. ఈ సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ‘నాకు దాదాపు 40 సంవత్సరాలనుండి సెప్టెంబర్ 20 అంటే పండగరోజు. ఎక్కడున్నా కచ్చితంగా హైదరాబాద్‌లో నాగేశ్వరరావుగారిని కలిసేవాడిని. ఆయన నాకు ఎంతో సన్నిహితుడు. ప్రాణమిత్రుడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా నా గుండెల్లో ఎప్పుడూ ఉండిపోతారు. అరవై, డెబ్భై ఏళ్లు నటించినా.. హీరో స్టెప్స్ ఎలావేయాలి? రొమాంటిక్ సాంగ్స్‌లో ఎలా నటించాలి? అని నేర్పించిన హీరో అక్కినేని నాగేశ్వరరావు. అదే స్టయిల్‌ను అక్కినేని నాగార్జున ఫాలోఅవుతూ తండ్రిని మించిన తనయుడిగా రాణిస్తున్నారు. దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమా చేసిన ఘనత అశ్వినీదత్‌గారిది. ఆనాటి ‘దేవదాసు’ అందరి గుండెల్లో ఎలా నిలిచిపోయిందో ఈ దేవదాసు కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది. నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. ‘నా అభిమాన హీరో అక్కినేని నాగేశ్వరరావుగారు. ఈరోజున ఆయన్ని తలచుకుంటూ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మా సంస్థలో అత్యధిక సినిమాలుచేసిన నా ఇంకో అభిమాన హీరో నాగార్జున. ఆయన నాకు చేసిన ఐదో సినిమా ఇది. నా మంచి మిత్రుడు నాని. ఆయన మాతో చేస్తున్న రెండో సినిమా. ఈమధ్యకాలంలో నాగ్‌అశ్విన్, శ్రీరామ్, వంశీ పైడిపల్లి, మా క్రిష్.. ఈ యంగ్ డైరెక్టర్స్ వచ్చి టోటల్ ఇండస్ట్రీ ట్రెండ్‌నే మార్చారు. రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. నేను నిమిత్త మాత్రుడిని. గత నాలుగైదేళ్లనుంచి నా సంస్థను నడిపిస్తున్నది రెండు శక్తులు. నా గ్రేట్ వరల్డ్‌వైడ్ పార్ట్‌నర్.. వయాకామ్ 18 అజిత్‌గారిని వేదిక మీదకు పిలుస్తున్నాను. అలాగే స్వప్న, ప్రియాంకను కూడా వేదికమీదకు పిలుస్తున్నాను’ అన్నారు.
దర్శకుడు శ్రీరామ్‌ఆదిత్య మాట్లాడుతూ వైజయంతీ మూవీస్‌లో పనిచేయడం చాలా గౌరవం. రూ.150 పెట్టి టిక్కెట్ కొనుక్కునేవాళ్ల గురించి ఆలోచించే వ్యక్తి అశ్వనీదత్‌గారు. నాగార్జునగారిని ఐదేళ్లక్రితం నేను బయట కలిసి నేను ఫొటో తీసుకుని మా అమ్మకు ఫోన్‌చేసి ‘అమ్మా.. బయట కూడా హీరోలాగా ఉన్నారమ్మా’అని అన్నా. వెంటనే మా అమ్మ ‘అవునా వెళ్లి కథ చెప్పేయ్’అని అన్నారు. ఆ సమయంలో నేను షార్ట్ ఫిల్మ్స్‌తీస్తున్నా. ఆ తర్వాత నాలుగేళ్లు తీసుకుని నేను ఇప్పుడు సినిమా చేస్తున్నా. ఆయన సెట్‌లోకి వచ్చిన వెంటనే ఓ ఆరా ఉంటుంది. అదే ఆరాను ఆడియన్స్ థియేటర్లలోనూ ఆస్వాదించవచ్చు. నాకు నాని అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హిమ్. నాని డైరెక్టర్స్ ట్రీట్. ఎలాంటి ఇబ్బంది అయినా తీర్చడానికి ఆయన ముందుంటారు’ అన్నారు. నాని మాట్లాడుతూ.. ‘నాగార్జునగారు ఏం తింటారో తెలుసుకోవాలని. ఏం తాగుతున్నారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉండేది. మా అసిస్టెంట్‌ని పిలిచి ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో తెలుసుకోమని చెప్పేవాడిని. మామూలుగా మనం తినేవే సార్.. అని చెప్పేవాడు. అందరూ తినేవి తిని, అందరూ తాగేవి తాగితే ఆయన మాత్రమే అంత అందంగా ఎలా ఉంటున్నారని అనిపించేది. ఆయనతో సినిమా చేశాక తెలిసింది ఏంటంటే ఆయన చాలా సరదా మనిషి. చాలా సరదాగా ఉండేవారు. చాలా ప్యూర్‌గా ఉండేవారు. దేవదాస్‌కి సంబంధించి సినిమా సక్సెస్ అయినా, ఇంకోటయినా నాకు బోనసే. లాస్ట్‌డే షూటింగ్‌కి వెళ్లినప్పుడు నాగార్జునగారు రఫ్ ఎడిట్ చూసి చెప్పిన మాటలు చాలు. నాకు ఆల్రెడీ సినిమా హిట్ అనే ఫీలింగ్ వస్తోంది. అందరికీ నచ్చితే అది కంప్లీట్ బోనస్.
నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇవాళ నాన్నగారు పుట్టినరోజు. ఏఎన్నాఆర్ లివ్స్ ఆన్. 1953లో ‘దేవదాసు’ సినిమా విడుదలైంది. మళ్లీ ఇప్పుడు ‘దేవదాస్’ సినిమా విడుదల కాబోతోంది. అదొక్కటి చాలుగా.. ఏఎన్నార్ లివ్స్ ఆన్ అని అనడానికి. అంతేకాదు.. అందరి అభిమానంలో నాన్నగారు లివ్స్ ఆన్. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి సినిమాకు. ఈ సినిమాను నేను మూడుకారణాలకోసం ఒప్పుకున్నా.. ఒకటి స్క్రిప్ట్. రెండో వైజయంతీ సంస్థ అధినేత అశ్వనీదత్‌గారూ, మూడోది నాని. స్క్రిప్ట్ వినగానే ఏమనిపించిందంటే. ఈ రోల్‌లో నేను పెద్ద యాక్ట్‌చేయనవసరం లేదని అనిపించింది. అవతల ఉన్న రోల్‌లో ఎవరిని అడిగితే ‘నాని’అన్నారు. ఇంక అసలు నేను యాక్ట్‌చేయక్కర్లేదు. పర్ఫెక్ట్‌గా సూటవుతుంది’ అని అన్నా.