లిరిక్.. మార్చక తప్పలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయమవుతూ రాము కొప్పుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’ విడుదలై మంచి స్పందనే అందుకుంది. అన్ని వర్గాలనుంచి అభినందనలు వస్తుండడంతో ఆనందంలో వున్న చిత్ర బృందాన్ని కొన్ని ఇబ్బందులు చుట్టుముట్టాయ. ఈ చిత్రంలోని ఓ పాటలో జైన మతస్థులు ఆరాధించే మంత్రాన్ని కించపర్చేలా చేశారని ఆరోపిస్తూ పలువురు ఆందోళనకు దిగారు. తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారు. జైనుల ఆందోళనకు చిత్ర బృందం వెంటనే స్పంచింది. తమ చిత్రంలోని పాటలో పొందుపర్చిన జైన మంత్రాన్ని వెంటనే మ్యూట్ చేశారు. ఈ రోజునుంచి ప్రదర్శితమయ్యే థియేటర్లలో మంత్రం వినిపించకుండా చేశామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఈ సమస్యను త్వరగానే పరిష్కరిస్తామని ప్రకటించారు. తమ పొరపాటువల్ల జైనుల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణలు చెబుతున్నట్టు ఒక నోట్‌ను సైతం విడుదల చేయడం గమనార్హం. దీంతో జైనమతస్థులు శాంతించారు. సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించవద్దని తమ సామాజిక వర్గ ప్రజలకు వెల్లడించారు.
మాస్ నుంచి డిస్కోకు..
మళ్లీ గ్యాప్ లేకుండా మాస్ రాజా వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. డైరెక్టర్ శీను వైట్లతో చేస్తున్న అమర్ అక్బర్ ఆంథోని షూటింగ్ చివరి దశకు చేరింది. చిత్రాన్ని దసరాకు తెద్దామనుకున్నా, వాయదా పడిందన్న వార్త వినిపిస్తోంది. మరోపక్క సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఒక్క క్షణం ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమాకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ దాటిన ప్రాజెక్టు త్వరలో సెట్స్‌పైకి రానుందని అంటున్నారు. తమన్ సంగీత దర్శకత్వంలో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయట. ఇందులో రవితేజది డ్యూయెల్ రోల్ అని వినికిడి. డిస్కో రాజా టైటిల్ పరిశీలనలో ఉంది. రామ్ తాళ్ళూరి నిర్మించే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.