దసరాకు.. మెగా కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగస్థలం సంచలన విజయం తరువాత రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానుంది. ప్రస్తుతం యూరప్‌లోని అజర్‌బైజాన్ ప్రాంతంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. చరణ్‌తోపాటు బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ పాల్గొంటున్నట్టు సమాచారం. సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా టైటిల్ గురించి క్యూరియాసిటీ ఎక్కువైంది. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దసరాకు విడుదల చేస్తారని తెలుస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తోన్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుంటే, తమిళ నటుడు ప్రశాంత్‌తోపాటు ఆర్యన్ రాజేష్ కీలక
పాత్రలు పోషిస్తున్నారు.