డిసెంబర్‌లో రోబో2.0

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0 చిత్రం షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లమధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ఫినిష్ చేయడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు శంకర్.
ఇటీవలే ఈ సినిమా గురించి ఆయన కొన్ని వివరాలు తెలియజేస్తూ, అక్షయ్‌కుమార్‌తో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. క్రమశిక్షణ కలిగిన నటుడు, కష్టపడే మనస్తత్వం వున్న వ్యక్తి అన్నారు. అక్టోబర్‌లో మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు, సెప్టెంబర్‌లోగా పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారట.