జీవితాన్ని తెలిపేలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనె్నండేళ్ల కల సాకారమయ్యే సందర్భం వచ్చిందని జూ.ఎన్టీఆర్ మనసులో మాట బయటపెట్టాడు. 27 సినిమాలు పూర్తి చేసిన తనకు 28వ చిత్రం కొత్త విషయం నేర్పిందన్నాడు. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చేసిన ‘అరవింద సమేత’ బతుకు ప్రాధాన్యం తెలిపిందన్నారు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన చిత్రం ‘అరవింద సమేత’. వీర రాఘవ ట్యాగ్‌లైన్. పూజాహెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లు. 11న విడుదల కానున్న చిత్రానికి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. వేడుకలో జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘త్రివిక్రమ్‌తో సినిమా చేయాలన్నది పనె్నండేళ్లనాటి కల. ఎన్నోసార్లు అనుకున్నా, ముందుకు సాగలేదు. ఎలాచేస్తే బావుంటుందన్న ఆలోచన దగ్గరే ఆగిపోయేది. ప్రతిసారీ ఏదో ఒక చిన్న అడ్డం, అదేంటో ఇప్పటికీ అర్థంకాదు. ఆయనా అదే పరిస్థితి ఎదుర్కొని ఉంటాడు. త్రివిక్రమ్ -‘నువ్వే నువ్వే’ సినిమా తీయకముందునుంచీ నాకు దగ్గరైన మిత్రుడు. కానీ సినిమా ఎందుకు కుదరడంలేదో అర్థమయ్యేది కాదు. కష్టసుఖాలన్నీ మాట్లాడుకోగల మంచి మిత్రులమైనా, ఇలా జరుగుతుందేమిటీ అనుకునేవాడిని. నాతోపాటు అభిమాన సోదరులూ అలాగే తపన పడివుంటారు. నా జీవితంలో నెలక్రితం జరిగిన ఘటనకు ఇది ముడిపడి ఉందేమో. ఆయనతో చిత్రం మొదలుపెట్టిన తర్వాతే, బహుశా నెలక్రితం జరిగిన ఇన్సిడెంట్స్‌తో జీవితం విలువ తెలిసొచ్చింది. ఈ సినిమా తాత్పర్యం ఒకటే -ఆడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు. కానీ యుద్ధం ఆపినోడే మగాడు, ఆడే మొనగాడు. మనకు జీవితంలో చాలామందితో తెలిసో తెలియకో బాధలు, గొడవలు ఉంటాయి. కానీ జీవితమంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం కాదు. జీవితమంటే బతకడం. ఎలా బతకాలో చెప్పే సినిమా ‘అరవింద సమేత... వీరరాఘవ’.
మనిషిగా పుట్టినందుకు ఎంత హూందాగా ఉండాలో, మనిషిగా పుట్టినందుకు ఎంత ఆనందంగా బతకాలో, మనిషిగా పుట్టినందుకు ఎలా బతకాలో చెప్పేదే ఈ సినిమా. టైటిల్ పెట్టినప్పుడు పవర్‌ఫుల్‌గా లేదని చాలామంది అన్నారు. ఒక మగాడి పక్కన ఆడదానికన్నా బలం ఇంకేదీ ఉండదు. ఒక గొప్ప సినిమా చేయడానికి.. జీవితం విలువ తెలిసేవరకూ, ఆ పరిపక్వత వచ్చేవరకూ దేవుడు ఆడి, ఇప్పుడీ సినిమా చేయిస్తున్నాడేమో. చాలా థాంక్స్ స్వామీ (త్రివిక్రమ్). పనె్నండేళ్లు త్రివిక్రమ్‌లో స్నేహితుడిని, దర్శకుడినే చూశా. ఈ సినిమా పూర్తయ్యేసరికి ఆత్మబంధువును చూస్తున్నా. రేపన్నరోజు ఎలాంటి కష్టంవచ్చినా, ఎన్ని దుఃఖాలు ఎదురైనా.. మీ అందరితోపాటు నిలుచునేవాడే త్రివిక్రమ్. ఈ సినిమా నా జీవితంలో ఓ మైలురాయి. 27 సినిమాల్లో ఎప్పుడూ కుదరని సన్నివేశం (తండ్రికి చితి పెట్టడం) యాదృచ్చికంగా ఈ సినిమాలోనే కుదిరిందేమో. గత నెల రోజులుగా నాకో అన్నలా, తండ్రిలా, మిత్రుడిలా త్రివిక్రమ్ తోడుగా ఉన్నాడు, కృతజ్ఞతలు’ అన్నాడు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘కొన్ని సందర్భాల్లో మాట్లాడటంకన్నా వౌనంగా ఉండటమే అందంగా ఉంటుంది. ఇది అలాంటి సందర్భమే. సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల చాలామంది ఇక్కడికి రాలేకపోయారు. వారందరికీ ధన్యవాదాలు. సినిమా అందరికీ నచ్చాలని ఆశిస్తూ, నచ్చుతుందని నమ్ముతున్నా. షూటింగ్ సమయంలో అతిపెద్ద విషాదం జరిగినా, దాన్నుంచి త్వరగా కోలుకుని జీవితంలోనూ హీరోగా ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’ అన్నారు. కార్యక్రమంలో కళ్యాణ్‌రామ్, జగపతిబాబు, తమన్, శివమణి తదితరులు పాల్గొన్నారు.