బన్నీయే చెప్పాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం స్టార్ హీరోలు కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. అప్‌కమింగ్ హీరోలు వైవిధ్యమైన కథలతో స్క్రీన్‌కు వస్తున్న తరుణంలో, భారీ బడ్జెట్‌తో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు రోటీన్ మూస కథలకే వెళ్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఎంచుకునే ప్రతి కథలోనూ ఏదోక కొత్తదనాన్ని స్టార్ హీరోలు వెతుక్కోక తప్పడం లేదు. తాజాగా అల్లు అర్జున్ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి చాలాకాలమే అవుతున్నా, తదుపరి ప్రాజెక్టు విషయంలో బన్నీ ఇంతవరకూ ఏమీ తేల్చలేదు. పలువురు దర్శకుల నుంచి కథలు వింటున్నాడే తప్ప, ఏ ఒక్కరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య తీవ్ర నిరాశ మిగల్చడంతో, తదుపరి ప్రాజెక్టు విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడని బన్నీ స్నేహితులు అంటున్నారు. మనం ఫేం విక్రంకుమార్‌తో బన్నీ కథా చర్చలు జరిపినపుడు, ఆయనతోనే తదుపరి సినిమా ఉండొచ్చన్న అంచనాలు వినిపించాయి. అయితే కథ విషయంలో బన్నీ సంతృప్తిగా లేకపోవడం, కథలో కొన్ని మార్పులను విక్రంకుమార్‌కు సూచించటంతో, అది ఇప్పట్లో తెమిలేలా లేదు. ఆ సినిమా వెనక్కి వెళ్లినట్టేనని అంటున్నారు. తాజాగా మరో ఇద్దరు దర్శకులు బన్నీకి కథలు వినిపించినట్టు ఇండస్ట్రీ టాక్. ఒకరు దర్శకుడు మారుతి అయితే, గీతగోవిందంతో సూపర్ సక్సెస్ అందుకున్న పరశురామ్ రెండోవాడు. కథలు విన్న బన్నీ, ఇద్దరికీ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని తెలుస్తోంది. ఈ రెండు కథల్లో ఏదోకటి ఫైనల్ చేసే అవకాశంపైనా అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ రెంటిలో బన్నీ ఏది ఓకే చేసినా, ఆ సినిమాని శానం నాగఅశోక్‌కుమార్, నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు దర్శకుల్లో బన్నీ ఓటు ఎవరికి పడుతుందో చూడాలి.