అనగనగా.. ఓ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా ఓ ప్రేమకథ చిత్రంతో విరాజ్ జె అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. టి ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని కెఎల్‌ఎన్ రాజు నిర్మిస్తున్నారు. రిద్ధికుమార్, రాధా బంగారు హీరోయిన్లు. చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -టైటిల్ సాంగ్‌లో సంగీతం, సాహిత్య మేళవింపు బావుంది. సినిమా రంగంలో చాలాకాలంగా కొనసాగుతున్న మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ హీరోగా పరిచయం అవుతుండటం ఆనందకర విషయం. పరిశ్రమలో బలంగా నిలబడిన మార్తాండ్ మాదిరిగానే విరాజ్ కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. దర్శకుడు ప్రతాప్‌కి బెస్ట్ విషెస్. సినిమా హిట్ కావాలి అని ఆకాంక్షించారు. టైటిల్ సాంగ్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేయడం పట్ల నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. అక్టోబర్‌లోనే చిత్రం విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్టు నిర్మాత వెల్లడించారు.