త్వరలో జెస్సీఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుంజయ్, పరుల్ యాదవ్ జంటగా పవన్ వడయార్ దర్శకత్వంలో వైవిధ్యభరిత ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం ‘జెస్సీ’. ఆర్.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై గతంలో సుబ్బు, మహానంది వంటి చిత్రాలను నిర్మించిన ఆర్.శ్రీనివాస్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వివరాలు తెలియజేస్తూ, నేటి యువతరాన్ని ఆకట్టుకునే ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిదని, కన్నడంలో మూడు సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన పవన్ వడయార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకముందన్నారు. పవన్ వడయార్ తెలుగులో ‘పోటుగాడు’ చిత్రాన్ని తీశాడని, ధనుంజయ, పరుల్ యాదవ్‌ల జోడీ అద్భుతంగా కుదిరిందని, ఇప్పటికే ఈ సినిమా ఆడియో కన్నడంలో సూపర్‌హిట్‌గా నిలిచిందన్నారు. తెలుగులో కూడా త్వరలో పాటలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అలాగే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.