తప్పుడు ప్రమాణాలూ లైంగిక వేధింపులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటిగా క్వీన్ చిత్రంతో మెప్పించింది కంగన. మహిళగా ‘మీటూ’ స్ఫూర్తితో దర్శకుడు వికాశ్ భల్‌కు చెక్ చెప్పింది. చరిత్రలో స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన రాణీ ఝాన్సీ లక్ష్మిబాయ్ పాత్రతో ‘మణికర్ణిక’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కంగన. బాంబే వెల్వెట్ ప్రమోషన్స్ టైంలో తనను లైంగికంగా వేధించాడంటూ వికాశ్ భల్‌పై గొంతువిప్పిన మహిళకు బాసటగా నిలవడమే కాదు, భల్ అకృత్యాలివీ అంటూ బట్టబయలు చేసిన కంగన తాజాగా తన వాదనకు మరో కోణాన్నీ చూపించింది. భల్ లైంగిక వేధింపుల వ్యవహారంపై దుమ్మెత్తిపోసిన కంగన, నర్మగర్భంగా హృతిక్‌నూ వ్యవహారంలోకి లాగడం తాజా విశేషం. ‘తప్పుడు ప్రమాణాలు చేస్తూ పెళ్లి మాటలతో మహిళలను వంచిస్తున్న మగాళ్లనూ లైంగిక వేధింపుల కోణంలోనూ చూడాలన్నది కంగన తాజా వాదన. బాలీవుడ్‌లో చిచ్చురేపుతున్న లైంగిక వేధింపుల వ్యవహారాలు పర్యావసానాలకూ దారితీస్తోన్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల మధ్య వికాశ్ భల్ తన లైసెన్స్‌ను ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఫైరింగ్ లేడీ కంగన్ కొత్త వాదననూ లేవనెత్తుతోంది. ‘వికాశ్ భల్ విషయంలో రెండో మాట లేదు. ఏం చెప్పానో దానికే కట్టుబడి ఉంటాను. కాకపోతే, భల్‌లాంటి వ్యక్తులు పరిశ్రమలో చాలామందే ఉన్నారు. దీనిపై వర్క్ చేస్తున్నాం. ప్రస్తుతం బాధిత మహిళలు గొంతువిప్పే దశలోనే ఉన్నారు. ఇప్పుడే సెలబ్రేషన్స్ చేసుకోలేం. మేం ప్రయాణించాల్సిన మార్గం పెద్దదే ఉంది. ఏ విభాగంలోనైనా పరిశ్రమకు వస్తున్న మహిళలు ధైర్యంగా, హాయిగా తన పని చేసుకుపోయే ప్రపంచాన్ని ఆవిష్కరించడమే మాముందున్న కర్తవ్యం’ అంటోంది కంగన. ‘్ఫల్స్ ప్రామిస్‌లతో మహిళలను లొంగదీసుకుంటున్న ప్రబుద్ధులూ లేకపోలేదు. పెళ్లి చేసుకుంటానని, ఇంకేవో కబుర్లు చెబుతూ లొంగదీసుకోవడాన్నీ లైంగిక వేధింపుల నేరంగానే చూడాలి. పెళ్లాలను సాధించిన ట్రోఫీల్లా ఇంట్లో పెట్టుకుని, కుర్ర పిల్లలను పక్కనేసుకుని తిరుగుతున్న చాలామందికి బుద్ధి చెప్పాలి’ అంటూ నర్మగర్భంగా హృతిక్‌ను ప్రస్తావించింది. ‘అలాంటివాళ్లు మాయమాటలతో అమ్మాయిల్ని లొంగ దీసుకుని, అవసరం తీరిన తరువాత పిచ్చోళ్లను చేసి రోడ్లపై వదిలేస్తున్నారు. వాళ్లతో ఎవ్వరూ పని చేయకూడదు. అలాంటి వాళ్లను పరిశ్రమనుంచి బహిష్కరించాలి’ అంటూ ఆగ్రహంతో వ్యాఖ్యానించింది కంగన.