భువనేశ్వరిగా మంజిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న యన్టీఆర్ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చిత్రంలో రానా ఏపీ సీఎం నారా చంద్రబాబు పాత్ర పోషిస్తుండటం తెలిసిందే. అయితే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాత్ర కోసం తమిళ హీరోయిన్ మంజిమా మోహన్‌ను చిత్ర బృందం ఇప్పటికే ఎంపిక చేసింది. తాజా సమాచారం ప్రకారం వచ్చేవారం అబిడ్స్‌లోని ఎన్టీఆర్ హౌస్‌లో జరగబోయే షెడ్యూల్‌లో మంజిమ పాల్గొనబోతోందట. నాగచైతన్య సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో మంజిమ మోహన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నారా భువనేశ్వరి పాత్రకు మంజిమ సరైన ఎంపికని చిత్ర బృందం భావిస్తోంది. మరోపక్క ఎన్టీఆర్‌తో ఎక్కువ స్క్రీన్ పంచుకున్న జయప్రద, జయసుధ పాత్రలకు ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపైనా చిత్ర బృందం తర్జనభర్జన సాగిస్తోంది. తొలుత రెండు పాత్రల్లో జయప్రద, జయసుధలనే ఒప్పిస్తారన్న ప్రచారం జరిగినా, తాజా పరిణామాల్లో కొత్త ఎంపికలు జరుగుతున్నట్టు సమాచారం. జయప్రద పాత్ర కోసం తమన్నా భాటియాను ఎంపికచేసే అవకాశం ఉంది.
బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతగా బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.