పుకార్లు నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నటుడు శరత్‌కుమార్ వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇటు హీరోయిన్‌గానే కాకుండా అటు వైవిధ్యమైన పాత్రలను పోషించే నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే సోషల్ మీడియాలో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని, ఇప్పటికే నిశ్చితార్థం పూరె్తైనట్టు కథనాలు వెలువడుతున్నాయి. వీటిపై వరలక్ష్మి సీరియస్ అయ్యింది. తన పెళ్లి విషయంలో వెలువడుతున్న గాలిమాటల్ని నమ్మొద్దని అభిమానులకు వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని, నటిగా ఇంకా ఎత్తుకు ఎదగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, కల్లిబొల్లి కథనాలను నమ్మాల్సిన అవసరం లేదని వరలక్ష్మి తెలిపింది. ప్రస్తుతం ఆమె విశాల్ హీరోగా లింగుస్వామి తెరకెక్కించిన ‘పందెంకోడి 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయదశమి కానుకగా అక్టోబర్ 18న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది -పందెంకోడి 2.