తాప్సి ‘గేమ్ ఓవర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ కథానాయిక తాప్సి ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ చిత్రం రాబోతోంది. తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ వై నాట్ స్టూడియోస్ దీన్ని నిర్మిస్తోంది. గతంలో సిద్ధార్థ్ హీరోగా ‘లవ్ ఫెయిల్యూర్’ (2012), విక్టరీ వెంకటేష్ హీరోగా గురు (2017) చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. తాజాగా తాప్సి లీడ్‌రోల్‌లో ‘గేమ్ ఓవర్’ నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. నయనతార కథానాయికగా తమిళనాట ఘనవిజయం సాధించిన మయూరి వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ గేమ్ ఓవర్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో గురువారం ప్రారంభమైంది. సరికొత్త కథ, కథనాలతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నేటినుంచి ఏకధాటిగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లో షూటింగ్ జరపనున్నట్టు నిర్మాత ఎస్ శశికాంత్ వెల్లడించారు. లవ్ ఫెయిల్యూర్, గురు విజయాల సరసన గేమ్ ఓవర్ కూడా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.