సైరా.. రాజగురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరాకు తగిన స్ఫురద్రూపంతో రాజగురువు మోషన్ పోస్టర్ విడుదలైంది. గాంభీర్యమైన సైరా నరసింహారెడ్డి పోస్టర్‌కు ఎక్కడా తగ్గకుండా రాజగురువు అమితాబ్ హావభావంతో విడుదలైన మోషన్ పోస్టర్ ఔరా! అనిపిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం -సైరా నరసింహారెడ్డి. ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారన్న విషయాన్ని ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, మోషన్ పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి. వచ్చే వేసవిలో విడుదల చేసే ఆలోచనతో శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు. జార్జియాలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జనవరి నుంచి పూర్తిస్థాయి ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. అందుకు ఇప్పటినుంచే సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్లతో సందడి చేస్తున్నారు. సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టుల బర్త్‌డేలకు మోషన్ పోస్టర్లను విడుదల చేస్తుండటం గమనార్హం. టీజర్‌లో మెగాస్టార్ నరసింహారెడ్డి లుక్‌కి అద్భుత స్పందన వచ్చింది. తాజాగా సైరానుంచి మరో మెగాస్టార్ లుక్ బయటకు వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ ఈ చిత్రంలో రాజగురువుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా అమితాబ్ లుక్‌ని లాంఛ్ చేసింది కొణిదెల టీమ్. సురేఖ కొణిదెల సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రాన్ని హీరో చరణ్ నిర్మిస్తున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.