ఉగాదికి బ్రహ్మోత్సవం ట్రైలర్?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 March 2016
ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని ట్రైలర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ట్రైలర్‌ను తెలుగు సంవత్సరాది రోజున విడుదల చేస్తారని తెలిసింది. పివిపి బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించిన ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీత గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలను ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేసి చిత్రాన్ని మేలో విడుదల చేస్తారట. హోలీ సందర్భంగా లేటెస్టుగా మహేష్ పోస్టర్‌ను విడుదల చేశారు.