సీక్వెల్ స్ట్రాటజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిట్టయిన చిత్రాలకు సీక్వెల్స్ చేసే పనిలో పడ్డాడు వెర్సటైల్ ఆర్టిస్ట్ కమల్‌హాసన్. ఒకవైపు వేగంగా రాజకీయాలవైపు అడుగులేస్తూనే, సినిమాలను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ‘విశ్వరూపం-2’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కమల్, త్వరలోనే భారతీయుడు-2 సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రమిది. దీని తర్వాత ప్రాజెక్టునూ కమల్ ప్రకటించేయడం విశేషం. సీక్వెల్ స్ట్రాటజీలో భాగంగానే హిట్టు చిత్రం ‘క్షత్రియ పుత్రుడు’కి కంటిన్యూషన్ తేనున్నట్టు చెప్పకనే చెప్పాడు. 1992లో కమల్ హీరోగా సంచలనం సృష్టించిన చిత్రం ‘క్షత్రియ పుత్రుడు’. శివాజీగణేశన్, రేవతి, గౌతమి ప్రధాన పాత్రలు చేసిన చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. భరతన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాకు కమల్ నిర్మాత, రచయిత కూడా. బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపి, జాతీయ, అకాడమీ అవార్డులనూ కొల్లగొట్టింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్‌ను నామినేట్ అయ్యింది. తాజాగా ఆ కథకు సీక్వెల్‌ను ప్రకటించాడు కమల్. క్షత్రియపుత్రుడు 2 ఉంటుందని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన పనులు మొదలుపెట్టిన తరువాత కమల్ ఈసారి సీక్వెల్ ప్రాజెక్టును ప్రకటించాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.