వినరా సోదర.. ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో లక్ష్మణ్ క్యాదరి నిర్మిస్తున్న చిత్రం ‘వినరా సోదర వీరకుమారా’. చిత్రం ఫస్ట్‌లుక్‌ను డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ బావుంది. దర్శకుడు సతీష్‌కి మొదటి సినిమా ఇది. కథ మొత్తం చెప్పాడు. మంచి మెసేజ్‌వున్న యూత్‌కి కావాల్సిన సినిమా అని పూరీ అన్నారు. సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన పూరికి కృతజ్ఞతలు తెలిపారు. యూత్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాన్ని దర్శకుడు సతీష్ చంద్ర బాగా తీర్చిదిద్దాడని, శ్రవణ్ భరద్వాజ్ మంచి పాటలు అందించారన్నారు. సెన్సార్‌లోవున్న చిత్రాన్ని నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్ తదితరులు నటించారు.