సౌత్‌పై ఫోకస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సొట్టబుగ్గల ఢిల్లీ బ్యూటీకి ఈమధ్య బాలీవుడ్ బాగానే అచ్చొచ్చింది. వరుస ప్రాజెక్టులు వర్కవుట్ కావడంతో మంచి హ్యాపీగా ఉందట తాప్సీ. మొదట కెరీర్ ఒకింత ఒడిదుడుకులైనా, తాజా ప్రాజెక్టులతో తాప్సీ నటిగా తనెంటే ప్రూవ్ చేసుకుంది కూడా. సౌత్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీకి దాదాపు ఐదారేళ్లు సరైన సక్సెస్ దొరకలేదు. అటు గ్లామర్‌పరంగా, ఇటు నటిగానూ చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. చేసేదిలేక బాలీవుడ్‌కు షిఫ్టయిన తాప్సికి పింక్, నామ్ షబానాలాంటి చిత్రాలు విపరీతమైన క్రేజ్ తెచ్చాయి. ఆ క్రేజ్‌తోనే ఇప్పుడు సౌత్‌పై మరోసారి ఫోకస్ పెట్టింది తాప్సీ. గ్లామర్ హీరోయిన్‌గా సౌత్‌లో ఓ వెలుగు వెలగాలన్న సాలోచనతో మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందట. తాజాగా కోలీవుడ్‌లో సినిమా చేయాలన్న ఆలోచనకు వచ్చిందని అంటున్నారు. ‘గేమ్ ఓవర్’ ప్రాజెక్టుతో మళ్లీ సౌత్‌లోకి అడుగుపెట్టిన తాప్సీకి తమిళంలో మరో రెండు సినిమాల ఆఫర్లు వచ్చాయట. సో.. బాలీవుడ్ అనుభవం, క్రేజ్‌తో సౌత్‌లో తాప్సీ గేరు మార్చనుందని అంటున్నారు.