అలా కనెక్టయ్యాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతోన్న లవ్ ఎంటర్‌టైనర్ -హలో గురు ప్రేమకోసమే. దసరా సందర్భంగా 18న ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున విడుదలవుతోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో హీరో రామ్ మాట్లాడుతూ ‘నేను, దిల్‌రాజు కలిసి మళ్లీ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఈ స్క్రిప్ట్‌కి కనెక్టయ్యాం. ఈ కథ విన్నవాళ్లంతా ఒకే ఒక పాయింట్‌కి కనెక్టవుతారు. దిల్ రాజు స్క్రిప్ట్ జడ్జ్‌మెంట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన లైఫ్‌లో లవ్ స్టోరీస్ ఉన్నాయో లేదో కానీ ప్రతి సినిమానూ ఎంతగానో ప్రేమిస్తారు. త్రినాథరావుతో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే త్రినాథరావు ముందు ఆడియెన్ తర్వాతే డైరెక్టర్. యాక్టింగ్ చేస్తుంటే నవ్వేస్తుంటారు. రైటర్ ప్రసన్నకుమార్ కామెడీ సీన్స్‌తోపాటు, ఎమోషనల్ సీన్స్‌ను బాగా రాశాడు. అలాగే సాయికృష్ణకు థాంక్స్. దేవిశ్రీప్రసాద్‌తో నేను చేసిన ఆరో సినిమా. సినిమా ఎలా ఉన్నా మా కాంబినేషన్‌లో అన్ని సినిమా పాటలు చార్ట్‌బస్టర్స్ అయ్యాయి. దేవిశ్రీప్రసాద్ సినిమాకోసం చాలా కష్టపడి పనిచేశాడు. ప్రకాశ్‌రాజుతో పనిచేయడం గౌరవంగా ఉంటుంది. ఆయనతో పనిచేస్తే నటులుగా మేం మమ్మల్ని తరచి చూసుకోగలుగుతాం. ఈనెల 18న సినిమా విడుదలవుతుంది’ అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘మన లైఫ్‌లో మనం చాలా చూస్తుంటాం. గెలిచినోళ్లు ఓడిపోతుంటారు. మళ్లీ గెలుస్తారు. స్పోర్ట్స్ పర్సన్స్‌కి సక్సెస్, ఫెయిల్యూర్ అనేది కామన్. ఓ ఎలక్షన్స్ గెలవడం, ఓడిపోవడం... మళ్లీ గెలవడం అనేది పొలిటీషియన్స్‌కి కామన్. అలాగే మా సినిమావాళ్ల విషయానికి వస్తే సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా సినిమా తీయాలనే ఫ్యాషన్‌తో ఇక్కడే ఉంటూ సక్సెస్ గురించి ట్రావెల్ అవుతుంటారు. సక్సెస్, ఫెయిల్యూర్ కామన్. కానీ మనం ముందుకెళ్తుండాలని చెప్పే రవికిషోర్ మాటల్ని నేను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాను అన్నారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘సినిమాలో రామ్‌కి ప్రకాశ్‌రాజ్ మామ అవుతాడా, ఫ్రెండ్ అవుతాడా? అనేదే సస్పెన్స్. 104 ఫీవర్‌లో కూడా రామ్ అద్భుతంగా డాన్స్‌చేశాడు. రామ్, ప్రకాశ్‌రాజ్‌ని పాట పాడమని అడగ్గానే వాళ్లు వెంటనే ఓకే చేశారు. వాళ్లు ఎలా పాడుతారోనని అనుకుని భయపడ్డాం. కానీ చాలా చక్కగా పాడారు. ఈనెల 18న సినిమా విడుదలవుతుంది’ అన్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘ఇది తెలుగులో 7వ చిత్రం. మరచిపోలేని జర్నీ. దిల్‌రాజు బ్యానర్‌లో శతమానం భవతి తర్వాత చేసిన చిత్రమిది. ఆ సినిమాకు ఎంత మంచి పేరువచ్చిందో ఈ సినిమాకూ అంతే మంచి పేరొస్తుందని ఆశిస్తున్నా అన్నారు.