కార్తీ రోల్ ఇదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైరెక్ట్ తెలుగు చిత్రంలో తొలిసారిగా ‘ఊపిరి’ చిత్రంలో నటించి మంచి ఆదరణనే పొందుతున్నాడు కార్తీ. ఆయన తాజాగా మణిరత్నం చిత్రంలో నటించనున్నాడని సమాచారం. మణిరత్నం సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు. హీరోయిన్ సాయి పల్లవి జంటగా ఓ రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కార్తీ పైలెట్‌గా నటిస్తున్నాడు. ఓ సరికొత్త లుక్‌తో కార్తీ నటించనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ ఎప్పట్లాగే మణిరత్నం సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ సీనియర్ నటులు కూడా నటించనున్నారని తెలుస్తోంది. మరింత సమాచారం త్వరలో తెలియనుంది.