ఆలోచింపచేసే బంగారి బాలరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బంగారి బాలరాజు’. కెయమ్‌డి రఫి, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం 25న విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు కోడేంద్ర దుద్యాల మాట్లాడుతూ బంగారు బాలరాజు ఆలోచింపచేసే చిత్రమన్నారు. ఇప్పటికే చిన్నికృష్ణ- చిట్టిబాబు రెడ్డిపోగు సంగీతం అందించిన ఆరు పాటలకు మంచి స్పందన వచ్చిందన్నారు. రాయలసీమలో జరిగిన యధార్థ పరువు హత్య నేపథ్యంలో కథ ఉంటుందని, అటు తల్లిదండ్రుల సమస్యలు, ఇటు పెళ్లిళ్ల నేపథ్యంలో ఉన్న పరిస్థితులను చర్చించడం జరిగిందన్నారు. చిత్రంలో ప్రేమ, పరువు హత్యలతోపాటు తల్లికొడుకుల సెంటిమెంట్, ఎమోషన్ అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. నిర్మాతల సహకారం మరువలేనని, హీరో హీరోయిన్‌గా నటించిన రాఘవ్, కరోణ్య తమతమ పాత్రల్లో అద్భుతంగా చేశారు. అలాగే టెక్నికల్ టీమ్ సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్నిరకాల కమర్షియల్ హంగులతో వస్తున్న చిత్రాన్ని అందరూ ఆదరించాలన్నారు.