సీక్వెల్‌గా పీకేసీ 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమకథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమర్షియల్ సక్సెస్‌ని సాధించిన ఆర్‌పిఏ క్రియేషన్స్ పీకేసీ 2 సీక్వెల్‌ను తెరకెక్కిస్తోంది. హరికిషన్‌ను దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంలో సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జోడీగా కనిపించనున్నారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రంలో పెర్‌ఫార్మన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నందిత శే్వత మెయిన్ హీరోయిన్. ఆర్ సుదర్శన్‌రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ‘ప్రేమకథా చిత్రం-2’ సినిమా మొదటి లుక్‌ని విజయదశమి సందర్భంగా విడుదల చేశారు. ‘బ్యాక్ డూ ఫియర్’ క్యాప్షన్‌తో వస్తున్న చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తయంది. రెండు పాటలు, క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉంది. నవంబర్ చివరి వారంలో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్‌పిఏ క్రియేషన్స్‌లో వచ్చిన ప్రేమకథా చిత్రం, జక్కన్న సంస్థకు మంచి పేరు తెచ్చాయ. ప్రేమకథా చిత్రం హిలేరియస్ కామెడీతో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ప్రేమకథా చిత్రం-2 ప్రారంభించామన్నారు. లవ్ అండ్ హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అన్నివర్గాల్ని ఎంటర్‌టైన్ చేసే కథ బ్యానర్‌కి మరో హిట్ అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు. 22నుండి బ్యాలన్స్ సాంగ్స్, క్లైమాక్స్‌ని షూట్‌చేసి నవంబర్‌లో చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.