రామ్ ఎన్నారై ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలీరజా, సీతా నారాయణన్ జంటగా ఎన్.లక్ష్మీనందా దర్శకత్వంలో మువ్వా సత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం ‘రామ్ ఎన్నారై’ (పవర్ ఆఫ్ రిలేషన్‌షిప్). ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, మానవ సంబంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథ కథనాలు హైలెట్‌గా వుంటాయని, శ్రావణ్ అందించిన పాటలు అందరికీ నచ్చుతాయని తెలిపారు. పాలకొల్లు, చించినాడ, పెనుమర్రు, కవిటం, లక్కవరం, పేరుపాలెం, హైదరాబాద్, చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని తెలిపారు. రామ్ ఓ ఎన్నారైగా ఇండియాకు తాతను కలవడం కోసం కోనసీమకు వస్తాడని, అక్కడ తన తండ్రికి వున్న పేరు ప్రఖ్యాతులు చూసి ఆశ్చర్యపోతాడని, తన తండ్రిని ఇక్కడికి రప్పించి కథను ఏ విధంగా నడిపించాడు అనేదే సినిమా కథనం అని తెలిపారు. త్వరలో పాటలను, సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సూర్య, రఘు, జోగినాయుడు, వేణుగోపాల్, రవివర్మ, సన, జయవాణి, కృష్ణచందు, రమేష్, మైనా, రవికుమార్, బాలాజీ, వెంకటాచలపతి, సునీల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:శ్రవణ్, మాటలు:వీరబాబు, కెమెరా:నాగబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎన్. లక్ష్మీనంద.