ముగ్గురితో లవ్ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెనే్సషనల్ హీరో విజయ్ దేవరకొండ, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు క్రాంతిమాధవ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా దసరా సందర్భంగా హైదరాబాద్‌లో మొదలైంది. పండువలా సాగిన కార్యక్రమానికి సినీ పెద్దలు హాజరయ్యారు. టి సుబ్బిరామిరెడ్డి, అల్లు అరవింద్, అశ్వినీదత్, బివిఎస్‌ఎన్ ప్రసాద్, సి కల్యాణ్, దర్శకులు కె రాఘవేంద్రరావు, నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టి సుబ్బిరామిరెడ్డి హీరో హీరోయిన్లపై తొలి షాట్‌కు క్లాప్ కొడితే, అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. విజయ్ కొత్త ప్రేమ కథా చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లె హీరోయిన్లు. గోపీ సుందర్ సంగీతం అందిస్తుంటే, జెకె సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నుంచి కెఎస్ రామారావు చిత్రాన్ని సమర్పిస్తుంటే, కెఎ వల్లభ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.