ఆరేసుకోవాలని పారేసుకున్నాను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో రెండు భాగాలుగా రానున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ యూనిట్ నుంచి రోజుకో విశేషం బయటికొస్తుంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. చరిత్ర సృష్టించిన గొప్ప పాత్రలున్న చిత్రంలో, పాత్రల స్థాయికి తగ్గట్లుగానే భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నారు. తాజాగా అలనాటి అందాల హీరోయిన్ జయప్రద పాత్రను ప్రస్తుత హీరోయిన్ తమన్నా చేస్తోంది. హీరోయిన్ తమన్నా ఇప్పటికే బయోపిక్ షూటింగ్‌లో పాల్గొంది. అయితే ఓ పాటకు సంబంధించి కొన్ని షాట్స్, అలాగే అప్పటి సినిమా షూటింగ్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కీరవాణి అద్భుత బాణీలు ఇచ్చాడన్నది యూనిట్ మాట. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.