వస్తున్నాడు.. టాక్సీవాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినావున్న స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సీవాలా’. మంచి అభిరుచిగల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న జిఏ 2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో ఎస్‌కెఎన్ నిర్మాతగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రంకోసం రూపొందిస్తున్న అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనున్నాయని అంటున్నారు. గ్రాఫిక్స్‌కి సంబంధించిన పనుల కారణంగానే చిత్రం విడుదల కాస్త ఆలస్యమైందని, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని యూనిట్ చెబుతోంది. గీతగోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో రూపొందిస్తున్నారు. చిత్రం ఫస్ట్‌లుక్ టీజర్‌కి క్రిటికల్ అప్లాజ్ రావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నవంబర్ 16న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. చిత్ర నిర్మాత ఎస్‌కెఎన్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని చిత్రాన్ని నిర్మించామన్నారు. విజయ్ ఇమేజ్‌కి తగ్గట్టుగానే అన్నివర్గాల్ని ఎంటర్‌టైన్ చేసేలా దర్శకుడు రాహుల్ చిత్రాన్ని తీర్చిదిద్దాడన్నారు. విజయ్ మేనరిజమ్స్ యూత్‌ని ఆకట్టుకుంటాయని, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తాయన్నారు. గీత గోవిందం వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత ఏర్పడిన అంచనాలను దృష్టిలో ఉంచుకొని టాక్సీవాలాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నామన్నారు. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తాయని, స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ దృష్టిలో ఉంచుకొని చిత్రాన్ని గ్రాండియర్‌గా నిర్మించామన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌లో ఉందన్నారు. హిలేరియస్ సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రాన్ని నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నామన్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జుమీనన్, రవిప్రకాశ్, రవివర్మ, ఉత్తేజ్ నటిస్తున్నారు.