ఉగాది రోజునే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ హీరోగా నటించబోయే వందో సినిమా ఏమై వుంటుంది అన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం బాలకృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇప్పటికీ సరైన నిర్ణయాన్ని చిత్ర ప్రముఖులు ప్రకటించలేదు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారా అని అనేక పేర్లు ఊహాగానాలుగా వినిపించగా, చివరకు క్రిష్ పేరు ఖరారైంది. ఈ కాంబినేషన్‌లో సినిమా గురించి కూడా ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి వుంది. బాలయ్య, క్రిష్ కాంబినేషన్ తెరకెక్కన్న ఆ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఉగాది నాడు వెలువడనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 22 నుండి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో సాగనున్నదని సమాచారం. ఈ సినిమా అయితేనే తన వందో సినిమాకు సరిగ్గా సరిపోతుందని బాలకృష్ణ క్రిష్‌ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తలు. ఈ వార్త తమ అభిమాన హీరో వందవ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అనే అభిమానులకు కొత్త ఉత్సాహం నింపనుంది. ఏప్రిల్ 8న పూర్తి వివరాలు వారి అభిమానులకు తెలియడం ఖాయం!