పక్కింటి అమ్మాయనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి పేరు తెచ్చుకోవాలి- చాందిని
గీతానంద్, చాందినీ భగవనేనీ జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రాజ్ ధారపనేని నిర్మించిన చిత్రం ‘రథం’. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హీరోయిన్ చాందిని ముచ్చట్లు.
ముంబైవాసిని. చిన్నప్పటినుండి సినిమాల్లో చేస్తున్నా. బాల నటిగాను, ఏక్‌రిస్తా, రాజుచాచా లాంటి చిత్రాల్లోనూ నటించాను. సోనీ, కలర్స్, జీ, ఛానల్స్ వి లాంటి చానెళ్లలో ప్రసారమైన పలు సీరియల్స్, టీవీ యాడ్స్ చేసిన అనుభవం నాది. హీరోయిన్‌గా నన్ను అప్రోజ్ అయనపుడు, దర్శకుడు చెప్పిన కథ వినగానే ఒప్పుకున్నా. కెరీర్ పరంగానూ టీవీ సీరియల్స్‌కే పరిమితం కాకుండా, సినిమాల్లో అవకాశం రావడంతో ఓకే చెప్పా.
సినిమాలో అచ్చంగా పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్ర. ఒద్దికైన, సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగి ఎంబిబిఎస్ రెండో ఏడాది చదువుతున్న అమ్మాయి జీవితంలోకి ప్రవేశించిన ప్రేమ ఎలాంటి మలుపులు తిప్పిందన్నది కథ. లవ్‌స్టోరీతోపాటు ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. హీరో యోగానంద్ మంచి వ్యక్తి. తెలుగురాని నాకు ఈ సినిమాలో అనేక జాగ్రత్తలు చెప్పడం, సినిమా బాగా చేయడానికి ఉపయోగపడింది. అలాగే దర్శకుడు రాజ్ ప్రతి విషయంలో ఎంతో సపోర్ట్ అందించాడు. ఈ టీమ్‌తో పనిచేయడం నా లక్కీ. ఇది రొటీన్ కథ కాదు. కొత్తదనంతో అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా.
మీ టూ గురించి అనేకమంది స్పందించడం మంచి పరిణామమే. కానీ ఎప్పుడో సంఘటనలు ఇప్పుడు చర్చించడం సరికాదు. అప్పుడే గొంతు విప్పివుంటే పరిస్థితి మరోలా ఉండేది. నా విషయాలన్నీ పేరెంట్స్ దగ్గరుండి చూసుకుంటున్నారు, నేను అలాంటి వేధింపులను ఎదుర్కోలేదు. టీవీ ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్ ఉండదు. ఎందుకంటే అక్కడ ఏ ఒక్కరి ఆధిపత్యం ఉండదు కనుక. తెలుగు డబ్బింగ్ చిత్రాలు టీవీల్లో చూస్తుంటాను. నాకు హీరో నాని అంటే ఇష్టం. నాగచైతన్య కూడా. తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించాలని ఉంది. తరువాతి ప్రాజెక్టులు కొన్ని చర్చల్లో ఉన్నాయ.