నాగ్ -ధనుష్‌ల నాన్ రుద్రన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున లేటెస్ట్‌గా నానితో కలిసి దేవదాస్ అనే మల్టీస్టారర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాలమధ్య విడుదలైన దేవదాస్ యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత తమిళ్ హీరో ధనుష్‌తో కలిసి మరో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు నాగ్. ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ ఖరారుచేసారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాన్ రుద్రన్ అనే టైటిల్ ఓకే చేసారు. నాన్ రుద్రన్ అంటే తమిళంలో నేను రుద్రుడిని అనే అర్థం వస్తుంది. మరి తెలుగులో దాని అర్థంవచ్చేలా పెడతారా లేదా అన్నది చూడాలి. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. అతిథిరావు, ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా వడచెన్నై పేరుతో సినిమాచేసిన ధనుష్ ఈ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లదిశగా దూసుకుపోతుంది.