భారీ డిమాండ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవా భామ ఇలియానా ఎప్పుడైతే బాలీవుడ్‌ని నమ్ముకొని తెలుగు సినిమాలు మానేసిందో అప్పటినుండి ఆమెకు బ్యాడ్‌టైమ్ మొదలైంది. హిందీలో కేవలం రెండు మూడు చిత్రాలే చేసింది. అవీ గోవా బ్యూటీకి గొప్పగా కలిసి రాలేదు. సినిమాలు తగ్గడంతో మళ్లీ క్రేజ్ పెంచుకునే దిశగా హాట్ హాట్ ఫొటో షూట్‌లతో సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది. ఇలియానా ప్రేమాయణం ఊరంతా పొక్కడం, చర్చకు తావివ్వడంతో బ్యూటీకి సినిమాలు రావడం లేదని చాలాకాలంగా సాగుతోన్న ప్రచారం. ఈ కోణంలోనే క్రేజ్ తగ్గిందని అనుకున్నారంతా. అయితే తన క్రేజ్ ఎప్పటికీ తగ్గదని నిరూపిస్తోంది ఈ హాట్ సుందరి. ఎందుకంటే చాలా రోజుల తరువాత మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ రవితేజ సరన అమర్ అక్బర్ ఆంటోని చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇలియానా ఎంత రెమ్యూనరేషన్ వసూలు చేసిందో తెలుసా.. రెండు కోట్లు? షాకవుతున్నారా? అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తేనే చేస్తానని చెప్పడంతో ఇవ్వక తప్పలేదు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తిచేసిన బ్యూటీ, మళ్లీ బాయ్‌ఫ్రెండ్‌తో షికార్లు మొదలెట్టిందట.