ఎన్నా రైగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం ‘అ ఆ’. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే నెలలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నితిన్ ఎన్నారైగా నటిస్తున్నాడు. ఇప్పటివరకు ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్‌కళ్యాణ్, ‘పండగ చేస్కో’ చిత్రంలో రామ్, ‘కృష్ణాష్టమి’ సినిమాలో సునీల్, ఎన్నారై పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు నితిన్ ఎన్నారైగా నటిస్తుండడం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ స్టైలిష్ లుక్‌తో కనిపించనున్నాడు. అందుకు కొత్త ప్రయత్నాలు కూడా చేశాడు. ఈ సినిమా మేలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.