తిరుగులేని తేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెర అద్భుతం ‘బాహుబలి’ చిత్రం. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. వాటిని బద్దలు కొట్టడం సామాన్యమైన విషయం కాదు. అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ మాత్రం తన ‘తేరీ’ చిత్రంతో బాహుబలి రికార్డును బద్దలుకొట్టాడు. బాహుబలి ట్రైలర్‌ను 24 గంటల్లో 1.2 మిలియన్లమంది చూస్తే, ఇప్పుడు విజయ్ తాజా చిత్రం ‘తేరీ’ ట్రైలర్ కేవలం 22 గంటల్లోనే ఈ రికార్డును బద్దలుకొట్టింది. దీంతో అందరూ షాక్ తింటున్నారు. ఈ వరస చూస్తుంటే చిత్రం విడుదలై భారీ విజయాన్ని సాధిస్తే మరెన్ని రికార్డులు బద్దలు అవుతాయో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ చిత్రం తమిళ నూతన సంవత్సరం కానుకగా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో విజయ్ మూడు విభిన్న గెటప్‌లలో కనిపిస్తున్నాడు. జోసఫ్, విజయకుమార్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇవ్వన్నీ ఒక్క పాత్ర వేసిన వివిధ గెటప్సా? లేక ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం మొత్తం నిన్నటి తరం హీరోయిన్ మీనా కూతురైన నాలుగేళ్ల నైనిక చుట్టూనే తిరుగుతుంది. ఈ చిత్రంలో ఆ పాప విజయ్ కూతురిగా నటించనుందని సమాచారం.